కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేశారు
నా పేరు కె.రమేష్. మాది ఉప్పుగుండూరు గ్రామంలో మాదిగపల్లె. హోం గార్డుగా చేస్తున్నాను. ఒంగోలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే కేవీ సుబ్బయ్య మా ఊర్లో పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ఈ విషయంపై పోలీసు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. వారి సూచనల మేరకు ఆ తరువాత కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశా. నేటి వరకు 10 సార్లు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదు. కానీ నేను హెడ్ కానిస్టేబుల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశానని విధుల నుంచి సస్పెండ్ చేశారు. నన్ను ఆర్థికంగా దెబ్బ తీయడమే కాకుండా పల్లెలో తనకు ఎదురు మాట్లాడేవారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ‘నాకు పోలీసు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి.. నన్నెవరూ ఏమీ చేయలేరంటూ’ రెచ్చిపోతున్నాడు. నాకు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment