ప్రదక్షిణలు చేస్తూ!
దిక్కులు చూస్తూ..
9 ఏళ్లుగా తీసుకుంటున్న పింఛన్ ఆపేశారు
నా పేరు పఠాన్ జిలానీ ఖాన్. మాది గిద్దలూరు. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పక్షవాతంతో బాధపడుతున్నాను. 9 ఏళ్లుగా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సదరం సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేశారు. సీకేడీ పింఛన్ లబ్ధిదారులకు గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లలో ఒంగోలు జీజీహెచ్‌లో రెండు సార్లు రీ అసెస్‌మెంట్ నిర్వహించారు. నవంబర్‌లో హాజరయ్యాను. ఆరోగ్యం బాగాలేకపోవడంతో డిసెంబర్‌లో హాజరుకాలేకపోయాను. జనవరి నుంచి నాకు పింఛన్ ఇవ్వకుండా ఆపేశారు. ఎందుకు ఆపేశారో నాకు తెలియదు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అధికారులను కలిస్తే నా పింఛన్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. కొత్తగా మళ్లీ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. 9 ఏళ్లుగా తీసుకుంటున్న పింఛన్‌ను ఒక్క మాట కూడా చెప్పకుండా తీసేయడం దారుణం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. భూ ఆక్రమణలు, కబ్జాలు, భూముల
రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు, అవినీతి, అధికారుల వేధింపులు, రాజకీయ నాయకుల కక్షసాధింపు చర్యలతో ప్రజలు విసిగివేసారి పోతున్నారు. న్యాయం కోసం స్థానిక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలో
నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండడంతో ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుంతుందో తెలియక దిక్కులు చూస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వారిని ‘సాక్షి’ పలకరించింది. వారి సమస్యలను తెలుసుకుంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక చుట్టూ తిరుగుతున్న ప్రజలు నెలల తరబడి కలెక్టర్ కార్యాలయానికి బాధితులు గత 9 నెలల్లో 35,793 దరఖాస్తులు పలుకుబడి ఉంటే క్షణాల్లో పరిష్కారం అధికార పార్టీ నేతలు చెబితే ఓకే కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులు వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చున్నా కొన్ని పరిష్కారమయ్యేవంటున్న లబ్ధిదారులు
ప్రదక్షిణలు చేస్తూ!
ప్రదక్షిణలు చేస్తూ!
Comments
Please login to add a commentAdd a comment