అధికార పార్టీ నాయకుల జోక్యం
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరుల జోక్యం మితిమీరుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులను పచ్చ తమ్ముళ్లకు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా దానికో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. పనినిబట్టి రూ.10 నుంచి రూ.25 వేలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దాంతో కొంతమంది అధికారులు సైతం పచ్చ తమ్ముళ్లతో కుమ్మక్కయి రెండు చేతులా సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినా మండల స్థాయి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా జిల్లా స్థాయి అధికారులు ఫోన్ చేసి ఫలానా పని ఎందుకు చేయలేదని అడిగితే స్థానిక ఎమ్మెల్యే పేరు చెబుతుండడంతో మాకెందుకులే ఈ తలనొప్పులు అని సదరు అధికారులు మిన్నకుండిపోతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని ఒక ఎమ్మెల్యే తమ్ముడే అన్నీ ప్రభుత్వ కార్యాలయాల వ్యవహారాలను చూస్తున్నారు. మరో నియోజకవర్గంలో ఇన్‌చార్జి బావమరిది పనులను చక్కబెడుతున్నట్లు సమాచారం.
గ్రీవెన్స్‌కు
హాజరైన అర్జీదారులు
శాఖల వారీగా ఫిర్యాదులు..
భయంతో ఫిర్యాదులు చేయడం లేదు...
భూ కబ్జాలు, రాజకీయ నాయకుల వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి జిల్లావాసులు భయపడిపోతున్నారు. ఒంగోలు నగరంలో ఒక వృద్ధ దంపతుల ఇంటిని అద్దెకు తీసుకున్న ఒక రాజకీయ నాయకుడు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించాడు. అతడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చాలని ఆ దంపతులు మౌనంగా రోదిస్తున్నారు. సుమారు రూ.10 కోట్లు విలువైన ఆ ఆస్తి ప్రస్తుతం రాజకీయ నాయకుడి కబ్జాలో ఉండడం గమనార్హం. జిల్లాలో ఇలాంటి కబ్జాలు ఎన్నో ఉన్నాయి. ఇక చిరుద్యోగుల వేధింపుల లెక్కేలేదు. పెద్దారవీడు మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ ఇచ్చిన మిర్చి రైతు పంటను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలుతో సహా జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో అనేక మంది పింఛన్లు తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరిగిపోయిన కాలుకు చికిత్స చేయించుకునేందుకు వెళ్లడమే నేరం అన్నట్లు ఓ వృద్ధురాలి పింఛన్ తొలగించారు. ఆరోగ్యం బాగాలేక పోవడంతో రీ అసెస్‌మెంట్‌కు హాజరుకాలేక పోయిన పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి పింఛన్ అన్యాయంగా తీసేశారు. ఇదే గత ప్రభుత్వంలో అయితే వలంటీర్లు ఇంటి దగ్గరకు పింఛన్లు తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్లేవారు. ఏదైనా సమస్య ఉంటే దగ్గరుండి పరిష్కరించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా పింఛన్లు తొలగించడమే కాకుండా వాటిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేయడం పట్ల ప్రజలు మండిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment