38 మందికి కారుణ్య నియామక పత్రాలు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య కోటాలో అర్హులైన 38 మందికి సోమవారం గ్రీవెన్స్ హాలులో కలెక్టర్ తమీమ్‌అన్సారియా నియామక పత్రాలను అందించారు. ప్రభుత్వ సర్వీస్ లోకి వస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకష్ణ, డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పి.భానుసాయి
ఒంగోలు: ఒంగోలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పి.భానుసాయిని బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఒంగోలులోనే విధులు నిర్వహిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. ఇటీవల విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికై న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ రోషన్ ఒంగోలు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌కు చెందిన యర్రం షాలినీరెడ్డి ఒంగోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. గిద్దలూరు నుంచి జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికై న షేక్ ఖాజా రెహ్మాన్‌ను పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నియమించారు.
సచివాలయ ఏఎన్‌ఎంలకు పదోన్నతులు
ఒంగోలు టౌన్: జిల్లా సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం గ్రేడ్–3లకు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ)గా పదోన్నతులు కల్పించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఛాంబర్‌లో సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. పదోన్నతి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డీఎంహెచ్‌ఓ డా.వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు నాయుడు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్యర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పని చేస్తున్న 210 మందికి పదోన్నతులు కల్పించారు. పదోన్నతి లభించిన ఏఎన్‌ఎంలు వెంటనే వారికి కేటాయించి ప్రదేశంలో బాధ్యతలు స్వీకరించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో ఏవో గీతాంజలి, సూపరింటెండెంట్ రాజేష్, సీనియర్ సహాయకులు రాజేశ్వరి, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ముండ్లమూరు (దర్శి): ఈతకు వెళ్లి మండలంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన కోడిగ రమేష్ కుమారుడు పవన్‌కుమార్ (10) విజయవాడ కృష్ణా నదిలో మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పవన్ విజయవాడలో తన తాత ఇంట్లో ఉంటూ అక్కడ ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఒంటిపూట బడులు కావడంతో ఈత కొట్టేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలోకి వెళ్లాడు. ఇద్దరు మాత్రమే ఇంటికి వచ్చారు. పవన్‌కుమార్ ఇంటికి రాకపోవడంతో తమ పిల్లవాడు ఏడని ఆ ఇద్దరినీ అడుగగా నదిలో ఈతకు వెళ్లి మునిగి బయటకు రాలేదని చెప్పారు. దీంతో పిల్లవాడిని మునిగిన చోట వెళ్లి వెతకగా మృతదేహం కనిపించింది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
38 మందికి కారుణ్య నియామక పత్రాలు
Comments
Please login to add a commentAdd a comment