ఎస్‌సీఈఆర్‌టీ సభ్యుడిగా నబీ
తర్లుపాడు: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అసెస్‌మెంట్ సెల్‌కు తర్లుపాడు మండలం కారుమానిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దూదేకుల నబీని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ డి.సుజాత తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీకి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ఏర్పాటుకు ఈ నెల 6న విజయవాడలో నిర్వహించిన రాత పరీక్షలో టాప్ 5లో నిలిచిన ఉపాధ్యాయులకు విడివిడిగా ఇంటర్‌ూయ్వలు నిర్వహించి ఎంపిక చేశారని వివరించారు. ఏడాదిపాటు అమరావతిలోని ఎస్‌సీఈఆర్‌టీలో పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని నబీ తెలిపారు. ఈ సందర్భంగా నబీని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment