ఇన్‌ఫార్మర్‌నే ఇరికించారు!
సింగరాయకొండ: గంజాయి అమ్మేవారిని పట్టుకునేందుకు ఇన్‌ఫార్మర్‌ను రంగంలోకి దించి చివరికి ఆ ఇన్‌ఫార్మర్‌నే ఎకై ్సజ్ పోలీసులు కేసులో ఇరికించారని ఇన్‌ఫార్మర్ బంధువులు ఆరోపిస్తుండగా, ఎకై ్సజ్ పోలీసులు మాత్రం అసలైన నిందితులినే పట్టుకున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నిందితుల్లో ఒకరు ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయిన సంఘటన చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల ప్రకారం.. గత శనివారం స్థానిక బుంగబావి సెంటర్‌లో నివసిస్తున్న హరిశ్చంద్ర అనే యువకుడిని నీకు మద్యం సీసా ఇస్తా..నాకు గంజాయి కావాలంటూ ఎకై ్సజ్ కానిస్టేబుల్ నమ్మబలికాడు. గంజాయి తీసుకురావాలంటూ అతనికి రూ.9 వేలు డబ్బులిచ్చాడు. గంజాయి తెచ్చిస్తే మద్యం సీసా ఉచితంగా వస్తుందని ఆశపడిన హరిశ్చంద్ర తన స్నేహితుడైన బాలయోగినగర్‌కు చెందిన బల్సురి శివకు విషయం చెప్పి గంజాయి కావాలని అడిగాడు. దీంతో శివ పాతసింగరాయకొండ పంచాయతీ గుజ్జుల యలమందారెడ్డినగర్‌లో గంజాయి అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లి రూ.6 వేలిచ్చి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి ఎకై ్సజ్ కానిస్టేబుల్‌కు గంజాయి ప్యాకెట్ ఇచ్చారు. దీంతో ఆ కానిస్టేబుల్ వారిద్దరినీ పట్టుకుని మీరు గంజాయి అమ్ముతారా అని అడగడంతో.. మేము పలానాచోట గంజాయి తెచ్చామని వారు చెప్పారు. వారిద్దరినీ తీసుకుని గంజాయి అమ్మే మహిళ వద్దకు వెళ్లగా, తాను గంజాయి అమ్మడం లేదని, హరిశ్చంద్ర వద్ద తీసుకున్న రూ.6 వేలను కానిస్టేబుల్‌కు ఆ మహిళ తిరిగిచ్చింది. దీంతో కానిస్టేబుల్ హరిశ్చంద్ర, శివలను అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఆదివారం సెలవు కావడంతో కోర్టులో హాజరుపరచడం వీలుపడక సోమవారం వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచేందుకు స్నానం చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ పోలీసులను ఏమార్చి స్టేషన్ నుంచి శివ పరారయ్యాడు. దీంతో నిందితుల్లో ఒకరే దొరికారని, మరొకరి కోసం గాలిస్తున్నామని ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఎకై ్సజ్ సీఐ శివకుమారిని వివరణ కోరగా, తమకు అందిన సమాచారంతో స్థానిక కందుకూరు రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న హరిశ్చంద్రను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద 100 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతను బల్సురి శివ వద్ద గంజాయి కొన్నానని చెప్పడంతో శివ కోసం గాలిస్తున్నామన్నారు. హరిశ్చంద్రపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. అయితే, ఈ కేసులో హరిశ్చంద్రను ఇన్‌ఫార్మర్‌గా వాడుకుని అన్యాయంగా ఇరికించారంటూ అతని బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికులు మాత్రం గుజ్జుల యలమందారెడ్డి నగర్‌లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, ఆ విషయం పోలీసులకు తెలీకుండా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అమలు కావడం లేదని, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గంజాయి వ్యవహారంలో ట్విస్ట్ ఎకై ్సజ్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 100 గ్రాముల గంజాయి స్వాధీనం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ నుంచి పారిపోయిన ఒక నిందితుడు వేర్వేరు వాదనలు వినిపిస్తున్న ఎకై ్సజ్ పోలీసులు, బాధితులు
Comments
Please login to add a commentAdd a comment