
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్, రాష్ట్ర కార్యదర్శి ఈదులముడి మధుబాబు కోరారు. ఒంగోలులో మంగళవారం జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొప్పరాజు చిన రాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమన్, మధుబాబు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మెప్మా, సెర్ఫ్‌లలో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందని, ప్రస్తుతం అందరూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. అందరికీ హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు, భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మంత్రివర్గం సమావేశంలో ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపీడీకి గురయ్యేట్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బయటకు నెట్టవద్దన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆప్కాస్ రద్దుపై ఏర్పడిన అనిశ్చితిని ప్రభుత్వం తొలగించాలని కోరారు. జిల్లా నాయకులు రాఘవరావు, రాయుడు, నాగమల్లేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment