
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
దొనకొండ: మండలంలోని గంగదేవిపల్లిలో లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య తిరునాళ్లను పురస్కరించుకొని మంగళవారం ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో 5 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పోటీల్లో బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరయ్య స్వామి ఎడ్ల జత 3759 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన జి.నాగిరెడ్డి ఎడ్లు 3751 అడుగులు లాగి రెండవ స్థానం, యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామానికి చెందిన షేక్.నజీర్‌బాషా ఎడ్లు 3500 అడుగులు లాగి మూడోస్థానం, నంద్యాల జిల్లా గడ్డివేముల మండలం పెసరాయి గ్రామానికి చెందిన సయ్యద్ కలామ్ బాషా ఎడ్లు 3250 అడుగుల లాగి నాల్గవ స్థానంలో నిలిచాయి. ఎడ్ల యజమానులకు దాతల సహకారంతో రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు బహుమతులు అందజేశారు. బండలాగుడు పోటీలను తిలకించడానికి వచ్చిన ప్రజలకు గ్రామస్తులు సహాకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment