
కన్నీటి వీడ్కోలు
వైవీ మాతృమూర్తికి
● వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలకు మేదరమెట్లకు వచ్చిన జగన్ ● సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులు ● కుటుంబ సభ్యులకు పరామర్శ ● అర్ధగంటపాటు అక్కడే గడిపిన జననేత
సాక్షి ప్రతినిధి,బాపట్ల: రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మృతిచెందగా స్వగ్రామం మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు మంగళవారం బంధువులు, పార్టీశ్రేణుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నాడని తెలుసుకొని వేలాదిగా కార్యకర్తలు, అభిమానులే కాదు సామాన్య జనమూ తరలి వచ్చారు. ఎంతగా అంటే జనం తాకిడికి జగన్ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ తర్వాత జగన్ వైవీ ఇంటికి చేరుకొని అక్కడ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించి చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, చిన్నమ్మ స్వర్ణమ్మ, చిన్నాన్నలు వైవీ భద్రారెడ్డి, హనుమారెడ్డి, సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డిలతోపాటు వారి కుటుంబ సభ్యులందరినీ పలకరించి పరామర్శించారు. భుజంతట్టి ఓదార్చారు. అక్కడే ఉన్న తల్లి విజయమ్మ, మేనమామ రవీంద్రనాథరెడ్డి ఇతర బంధువులతో మాట్లాడారు. అర్ధగంట పాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో గడిపారు. వైఎస్సార్ సీపీ నేతలను పేరుపేరునా పలకరించారు. వైవీ ఇంటి నుంచి జగన్ తిరుగు ప్రయాణంలోనూ ఆయన వాహనం ముందు చేరిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. పిచ్చమ్మ భౌతిక కాయానికి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా వెంకట రాంబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు, చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ తదితరులు నివాళులర్పించారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు
Comments
Please login to add a commentAdd a comment