
ఆధార్‌కార్డుల నవీకరణ పటిష్టంగా నిర్వహించాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి
ఒంగోలు సిటీ: ఆధార్‌కార్డుల నవీకరణ ప్రక్రియ జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో ఆధార్‌కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియ పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆధార్ కార్డుల నవీకరణ పెండింగ్ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, జీఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధార్ నమోదు కేంద్రాలన్నీ పని చేయాలన్నారు. కొత్తగా జన్మించిన శిశువుల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కు సంబంధించి బర్త్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అనే విధానాన్ని అవలంబించాలన్నారు. నవీకరణ ప్రక్రియపై ప్రజలకు తక్షణమే అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఏ ఆస్పత్రిలో శిశువు జన్మించినా తక్షణమే ఆ శిశువు ఆధార్ నమోదు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ ఐడీ నమోదులో పెండింగ్ ఉండరాదని ఆదేశించారు. ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ఐసీడీఎస్ పీడీ హేన సుజన, ఉదయ్ సంస్థ ప్రతినిధులు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment