మృతదేహానికి పోస్ట్‌మార్టం
9 నెలల తర్వాత
చీమకుర్తి: దాదాపు 9 నెలల క్రితం ఉరేసుకొని మృతి చెందిన పులివర్తి బాలసుబ్రహ్మణ్యం మృతదేహానికి శుక్రవారం రిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ సుబ్బారావు ఆధ్వర్యంలో చీమకుర్తిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడు బాలసుబ్రహ్మణ్యం భార్య గౌరీ పూర్ణ ఫిబ్రవరి 13వ తేదీన తన భర్త మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మరణం వెనుక మామ, మరిది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివర్తి బాలసుబ్రహ్మణ్యం గత ఏడాది జూన్ 6వ తేదీన చీమకుర్తి పట్టణంలోని గాంధీనగర్‌లో ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. అయితే తన భర్త మరణానికి కుటుంబ ఆస్తుల వివాదమే కారణమని భార్య అనుమానం వ్యక్తం చేశారు. దీంతో శ్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహానికి తహసీల్దార్ ఆర్.బ్రహ్మయ్య, ఎస్సై కృష్ణయ్య, మృతుడి భార్య, బంధువుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ గౌరీపూర్ణ అనుమానాలు నివృత్తి కావని పోలీసులు చెబుతున్నారు.
భర్త మృతికి బంధువులే కారణమని భార్య అనుమానం పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో శవ పరీక్ష
Comments
Please login to add a commentAdd a comment