
పెట్రోలు బంకుల్లో విస్తృత తనిఖీలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని పలు పెట్రోలు బంకుల్లో ప్రభుత్వానికి చెందిన మూడు విభాగాల అధికారులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘కల్తీ కమ్మక్కు..కేసుల గమ్మత్తు’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తూనికల, కొలతల విభాగం, సివిల్ సప్లయీస్ విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ పెట్రోల్ బంకుతో పాటు నగరంలో ఐదు పెట్రోలు బంకుల్లో, పేర్నమిట్ట, మర్రిచెట్లపాలెం పెట్రోలు బంకుల్లో తనిఖీలు చేశారు. వినియోగదారులకు అనుమానం వచ్చినప్పుడు అక్కడికక్కడే పెట్రోలు, డీజిల్‌ను పరీక్షలు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment