
రూ.30 వేల బిల్లుకు రూ.20 వేల లంచం !
చీమకుర్తి: నెలకు రూ.15 వేల జీతం కోసం ఔట్‌సోర్సింగ్‌పై పనిచేసే వాచ్‌మెన్‌కు రెండు నెలల జీతం రూ.30 వేల బిల్లు చేయాలంటే తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు. తానంత ఇచ్చుకోలేనని ఎంత వేడుకున్నా కనికరించకపోవడంతో చివరకు వాచ్‌మన్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్.శిరీషా, స్థానిక గిరిజన గురుకుల పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. చీమకుర్తి గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో వాచ్‌మెన్‌గా గురవయ్య ఏడు సంవత్సరాలుగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ మూడేళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల 23 నుంచి దాదాపు రెండు నెలలు పాటు వేసవి సెలవులు కావడంతో ఆ రెండు నెలలకు జీతం ఇవ్వాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడు. బిల్లు చేస్తే తనకు వచ్చేదే రూ.30 వేలు...అలాంటిది రూ.20 వేలు ఇచ్చుకోలేనని ప్రిన్సిపాల్‌ను వేడుకున్నాడు. అయినా ప్రిన్సిపాల్ కనికరించకపోవడంతో చేసేది లేక గురవయ్య నేరుగా ఒంగోలులోని ఏసీబీ డీఎస్పీ కార్యాలయ సిబ్బందికి తన గోడు చెప్పుకున్నాడు. ఏసీబీ అధికారులు సూచించిన ప్రకారం శనివారం సాయంత్రం గురవయ్య తన వద్ద రూ.17,500 మాత్రమే ఉన్నాయని ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్‌కు ఇచ్చాడు. అదే సమయంలో డీఎస్పీ ఎస్.శిరీషా ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి అక్కడకు వచ్చి ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రిన్సిపాల్ వద్ద ఉన్న రూ.17,500ను రెడ్‌హ్యాండెడ్‌గా స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపాల్‌ను రిమాండ్‌కు పంపించనున్నట్లు డీఎస్సీ శిరీషా తెలిపారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు సీహెచ్.శేషు, రమేష్‌బాబు, ఎస్సైలు జేబీఎన్ ప్రసాద్, మస్తాన్ షరీఫ్, వారి సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. నెలకు రూ.1.50 లక్షల జీతం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ కేవలం రూ.15 వేల జీతంతో తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న వాచ్‌మన్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి చివరకు తన ఉద్యోగానికి ముప్పు తెచ్చుకున్నాడని పాఠశాల సిబ్బందే ఈసడించుకుంటున్నారు.
ఔట్‌సోర్సింగ్ వాచ్‌మన్ జీతం బిల్లు చేసేందుకు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కక్కుర్తి ఏసీబీకి పట్టుబడిన ప్రిన్సిపాల్
Comments
Please login to add a commentAdd a comment