
పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు
మూడు ఎకరాల్లో పసుపు సాగు చేశాను. సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పసుపు తవ్వుతుంటే ఆశించిన స్థాయిలో దిగుబడి కనబడటం లేదు. ధరలు కూడా సగానికి పడిపోయాయని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది పెట్టుబడులు కూడా వస్తాయో రావో అన్న అనుమానం కలుగుతుంది. పసుపు తవ్విన తర్వాత వండి, పాలిషింగ్ చేయడానికి అదనంగా రూ.50 వేల వరకు ఖర్చు వస్తుంది.
– షేక్ అబ్దుల్ వహీద్, పసుపు రైతు, కంభం
గిట్టుబాటు ధరలు కల్పించాలి
రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారు. ఏడాది పాటు కష్టపడి పండించుకున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి వారు అప్పుల పాలవుతున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలి.
– నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కంభం

పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు
Comments
Please login to add a commentAdd a comment