ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను నిర్దేశించిన గడువులోపు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, పార్ధసారథి, జాన్సన్, విజయజ్యోతిలతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు గత సోమవారం నుంచి భోజన సదుపాయాన్ని ఉచితంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 292 వినతులు వచ్చాయి.
మేసీ్త్రలను తొలగించటం అన్యాయం...
ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని మేసీ్త్రలు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేసీ్త్రలు అర్జీ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి మేస్త్రీలు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అర్జీ ఇచ్చిన వారిలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సహాయక కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసరావు ఉన్నారు.
అధికారులను ఆదేశించిన డీఆర్‌ఓ
చిన ఓబులేసు