24 నుంచి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద ఉన్న జిల్లా స్థాయి మహిళా ప్రాంగణంలో ఈ నెల 24వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా మేనేజర్ వై.అంజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు మహిళలకు ఈ శిక్షణ ఇస్తారన్నారు. 15 నుంచి 45 సంవత్సరాల్లోపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మేనేజర్ అంజమ్మ కోరారు. మరిన్ని వివరాలకు 8333921346 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
వరిగడ్డి దగ్ధమై రూ.2 లక్షల ఆస్తి నష్టం
దర్శి: వరిగడ్డి వామి దగ్ధమై రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన శుక్రవారం పట్టణంలోని పుట్ట బజారులో చోటు చేసుకుంది. బాధితురాలు మస్తాన్‌బీ తెలిపిన వివరాల మేరకు గేదెలు మేపుకునేందుకు 7 ఎకరాలకు పైగా వరిగడ్డి తీసుకొచ్చి వామి వేసుకున్నారు. శుక్రవారం వరి గడ్డి వామి నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు అదుపు చేసినా వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో టపాసుల శబ్దాలు వస్తున్నాయి. నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment