టీబీపై వ్యాసరచనలో కొమరోలు మెడికో ప్రతిభ
కొమరోలు: ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో కొమరోలు మండలం బొడ్డువానిపల్లె గ్రామానికి చెందిన మెడికో అక్కలరెడ్డి పరమేశ్వరి సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లా రాజోలులోని గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ కళాశాల(జెమ్స్)లో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న పరమేశ్వరికి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పీఎస్ వర్మ చేతుల మీదుగా మెడల్ బహూకరించారు. ఈ సందర్భంగా పరమేశ్వరిని ఆమె తండ్రి ఈశ్వర్‌రెడ్డి, గ్రామస్తులు అభినందించారు.