మార్కాపురం మున్సిపల్ బడ్జెట్
మార్కాపురం టౌన్: మార్కాపురం పురపాలక సంఘానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అధ్యక్షతన సోమవారం ప్రవేశపెట్టారు. నీటి సరఫరా నిర్వహణ, వీధి దీపాలు, డ్రైనేజీలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధిత ఆదాయం మొత్తాన్ని కేటాయించారు. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు, సగటు ఆదాయం, దుకాణాల అద్దెలు, బంకులు, మార్కెట్లపై వచ్చే సాధారణ ఆదాయం, ప్రభుత్వ గ్రాంట్లను మూల ధన ఆదాయంగా పరిగణలోకి తీసుకున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు.
● 2024–25 ఆర్థిక సంవత్సన మున్సిపల్ బడ్జెట్ అంత్య నిల్వ రూ.11,50,26,003 కోట్లు, 2025–26 బడ్జెట్‌కు సంబంధించిన ఆదాయం రూ.33,76,66,400 కోట్లు వెరసి మొత్తం రూ.45,26,92,403తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చైర్మన్ వివరించారు. కాగా 2026–27 బడ్జెట్ అంత్య నిల్వగా రూ.16,81,35,143 కోట్లను చూపారు.
● 2025–26 సంవత్సరానికి సంబంధించి గ్రాంట్లు, మూలధన ఆదాయంలో 40 శాతాన్ని మురికివాడల్లో నీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే 15 శాతం నిధులను షెడ్యూల్ కులాల అభ్యున్నతికి, 7.5 శాతాన్ని షెడ్యూల్ తెగల అభ్యున్నతికి, 5 శాతం నిధులను సీ్త్ర, శిశు సంక్షేమాభివృద్ధికి కేటాయించారు.
● జనరల్ ఫండ్ నుంచి నీటి సరఫరాకు 20 శాతం, రోడ్ల అభివృద్ధికి 19 శాతం, డ్రైనేజీలకు 13 శాతం నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మురికివాడల్లో 40 శాతం, షెడ్యూల్ కులాల అభివృద్ధికి 15 శాతం, షెడ్యూల్ తెగల అభివృద్ధికి 8 శాతం, సీ్త్ర, శిశు సంక్షేమానికి 5 శాతం, దివ్యాంగుల అభ్యున్నతికి 3 శాతం నిధులు కేటాయించామని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ డీఈ శ్రీనివాసులు, ఏఈలు, శానిటరి ఇన్స్‌పెక్టర్, కౌన్సిలర్‌లు, కో ఆష్షన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్లకు ప్రాధాన్యం బడ్జెట్‌లో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 5 శాతం సీ్త్ర, శిశు సంక్షేమాభివృద్ధికి.. బడ్జెట్ ప్రవేశపెట్టిన మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ
రూ.45.26 కోట్లు