సముద్రంలో గల్లంతై యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

సముద్రంలో గల్లంతై యువకుడు మృతి

Apr 2 2025 12:18 AM | Updated on Apr 3 2025 1:00 PM

మరో యువకుడిని కాపాడిన మైరెన్‌ పోలీస్‌లు

వేటపాలెం: సముద్రం నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. మరో యువకుడిని మైరెన్‌ పోలీసులు కాపాడారు. ఈ సంఘటన మండలంలోని రామాపురం సముద్రతీరంలో మంగళవారం జరిగింది. మైరెన్‌ పోలీస్‌లు తెలిపిన వివరాల మేరకు..పర్చూరు నెహ్రు కాలనీకి చెందిన చుక్కా వంశీ (26) చిలకలూరిపేట దగ్గరలోని పసుమర్రు గ్రామానికి చెందిన షేక్‌ రహమతుల్లా ఇద్దరు రామాపురం సముద్రతీరానికి వచ్చారు. 

పర్యాటకులతో కలిసి ఇద్దరు సముద్రంలో స్నానాలు చేసే సమయంలో అలల తీవ్రతకు ఇద్దరూ కొట్టుకుపోతూ కేకలు వేశారు. అక్కడే ఉన్న మైరెన్‌ పోలీస్‌లు, స్థానిక జాలర్ల వెంటనే స్పందించి ఇద్దరిని నీటిలో నుంచి బయటికి తీసుకువచ్చారు. అయితే వంశీ సముద్రం నీరు బాగా తాగడంతో పరిస్థితి విషమించింది. అక్కడే సీపీఆర్‌ చేసి 108లో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో యువకుడు షేక్‌ రహంతుల్లా వెంటనే కోలుకున్నాడు. ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement