
విద్యార్థుల కూడు గోడుకు ఇవిగో సాక్ష్యాలు
రోజూ నీళ్ల చారే ‘ఏపీ మోడల్’
పెద్దదోర్నాల మండల పరిధిలోని మోట్ల మల్లికార్జునాపురంలోని ఏపీ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ విద్యార్థినులు 100 మంది భోజనంతో పాటు వసతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన సమాచారంతో పాఠశాలను తనిఖీ చేయగా.. బాలికలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రిన్సిపాల్ ఏది చెబితే అదే వండుతున్నానని పార్ట్ టైమ్ వార్డెన్ చెప్పగా.. మెనూలో వంటకాలపై ప్రిన్సిపాల్ నీళ్లు నమిలారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎవరూ ప్రశ్నించకుంటే వారికి రోజూ నీళ్ల చారే గతి!
మెనూకు మంగళం
‘మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు సార్. అడిగితే ఏమంటారోనని భయం. రోజూ ఆకలి బాధతో అల్లాడిపోతున్నాం’ ఇదీ ఒంగోలులోని దివ్యాంగుల హాస్టల్ విద్యార్థుల ఆవేదన. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఒంగోలు పర్యటనకు వచ్చిన విభిన్న ప్రతిభావంతుల ఆ శాఖ డైరెక్టర్‌కు మెనూ అమలు కావడం లేదని ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. దివ్యాంగులకు సరైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు పోషకాహారం అందించాల్సిన ప్రభుత్వం అది తమ పనికాదన్నట్టుగా వ్యవహరిస్తోందనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

విద్యార్థుల కూడు గోడుకు ఇవిగో సాక్ష్యాలు

విద్యార్థుల కూడు గోడుకు ఇవిగో సాక్ష్యాలు

విద్యార్థుల కూడు గోడుకు ఇవిగో సాక్ష్యాలు