
దొడ్డు బియ్యం.. తినలేకపోతున్నాం
‘రోజూ లావు బియ్యంతో అన్నం పెడుతున్నారు. అది తినలేకపోతున్నాం. మంచి నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ బిల్డింగ్ కూడా బాగోలేదు’ అని కనిగిరి బీసీ గురుకులం విద్యార్థులు రాష్ట్ర మంత్రులు ఎస్. సవి, ఆనం రామనారయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 8వ తేదీన కనిగిరి వచ్చిన ఇద్దరు మంత్రులు.. ఇక్కడి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మెనూ, ఇతర వసతుల గురించి ఆరా తీస్తున్న సమయంలో విద్యార్థులు తమ అవస్థలను తెలియజేశారు. వచ్చే ఏడాది నుంచి వసతి గృహాలకు బీపీటీ బియ్యాన్ని అందజేస్తామని పొడిపొడిగా మాట్లాడి మంత్రి సవిత వెళ్లిపోగా.. ఇక్కడి పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు.

దొడ్డు బియ్యం.. తినలేకపోతున్నాం