
చిన్న కంభంలో గోవా మద్యం పట్టివేత
కంభం: మండలంలోని చిన్నకంభంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ డి.బాలయ్య ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి నక్కా ప్రసాద్ అనే వ్యక్తి నివాసంలో అక్రమంగా నిల్వ ఉన్న గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నక్కా ప్రసాద్‌తో పాటు కర్నూల్‌కు చెందిన బెస్త హరికృష్ణ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ హరికృష్ణ స్వస్థలం కర్నూలు కాగా అతను గోవాలో పనిచేస్తుంటాడు. వీరిరువు కలిసి గోవా మద్యం ట్రైన్‌లో తెచ్చుకొని ఇక్కడ విక్రయించుకుంటాడు. అందిన సమాచారం మేరకు శనివారం ఉదయం నక్కా ప్రసాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 53 ఫుల్ బాటిల్స్ గోవా మద్యం దొరికిందని, ఇద్దరిని అదుపులోకి తీసుకొని మద్యాన్ని స్వాధీనం చేసుకొని అతనికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించినా, బెల్టుషాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకై ్సజ్ అధికారులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
జోరుగా గోవా మద్యం వ్యాపారం
గిద్దలూరు నియోజకవర్గంలో గోవా మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. గోవా నుంచి ఓ కంటైనర్‌లో మద్యం వస్తోందని, గిద్దలూరు, రాచర్ల, కంభం, మార్కాపురం మీదుగా నరసరావు పేటకు వెళ్తున్నట్లు సమాచారం. కంభం, బేస్తవారిపేట, అర్థవీడు మండలాలకు కేంద్రంగా చిన్నకంభం ఉన్నట్లు తెలిసింది. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు ఈ మద్యాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండు సార్లు ఎకై ్సజ్ అధికారులు గోవా మద్యం స్వాధీనం చేసుకోగా అది చిన్న కంభం నుంచే సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. ఎకై ్సజ్ అధికారులు గోవా మద్యం దొరికినప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పంపడం.. కొన్ని రోజులకే నిందితులు తిరిగి వచ్చేస్తుండటంతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. గోవా మద్యం అక్రమ రవాణాపై ఎకై ్సజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
53 ఫుల్ బాటిళ్లు స్వాధీనం
ఇద్దరిని అరెస్టు చేసిన ఎకై ్సజ్ పోలీసులు