
వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా
ఒంగోలు సిటీ: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని వైఎస్సాస్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 2029 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేటర్లు, ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దుంపా చెంచిరెడ్డి, దామరాజు క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకల్లో కార్యకర్తలనుద్దేశించి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి