
విధుల్లోకి సీనియర్ అసిస్టెంట్
మహిళా పోలీస్‌కు మెమో..
● వేతనం నిలిపివేత, వేధింపులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకే..
దళిత ఉద్యోగి అయిన ఉమామహేశ్వర పురం మహిళా పోలీస్ కట్టా అనూషపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ నేతలపై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఉపసంహరించుకునంటేనే వేతనం అందుతుందని ఇన్‌చార్జి ఎంపీడీఓ సహా పంచాయతీ కారదర్శి చెబుతుండటం, అందుకు అంగీకరించలేదని వేధిస్తున్న తీరుపై సోమవారం ప్రకాశం భవన్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు మహిళా పోలీస్ అనూష ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు ఇవ్వడంపై ఆగ్రహించిన ఇన్‌చార్జి ఎంపీడీఓ.. పంచాయతీ కార్యదర్శితో ఆమెకు మెమో జారీ చేయడం చర్చనీయాంశమైంది. పీ4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించడంపై వివరణ ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గ్రామ సచివాలయ పరిధిలో సర్వేలకు ఎన్.దాసు, టి.రవీంద్ర, ఎ.రామాంజిరెడ్డి, ఎ.నాగార్జున, డి.రాము బాధ్యులని పేర్కొంటూ కార్యదర్శి సంతకంతో గత శుక్రవారం ఓ లెటర్ ఇచ్చారు. ఈ ప్రకారం ఆ సర్వేలతో మహిళా పోలీస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ, సర్వేలు చేయలేదంటూ కార్యదర్శి మెమో జారీ చేయడంలో మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి. నాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకే మెమో ఇచ్చా. ఎంపీడీఓ చెబితేనే వేతనం ఆపా’ అని సెక్రటరీ, తాను జీతం ఆపమని చెప్పలేదని ఎంపీడీఓ పరస్పర విరుద్ధంగా స్పందించడం వేధింపుల తీరును తేటతెల్లం చేసింది.
ముండ్లమూరు(దర్శి):
‘ఎన్నాళ్లీ నరకం ...ఉద్యోగం చేయలేం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎట్టకేలకు సీనియర్ అసిస్టెంట్ కల్పన, టైపిస్ట్ ఆంత్రయ్యలను సోమవారం పై అధికారుల ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ గతంలో అనారోగ్య కారణంతో మెడికల్ లీవ్ పెట్టుకుని నెల రోజులు సెలవుపై వెళ్లారు. సెలవు నుంచి వచ్చిన వెంటనే విధుల్లోకి తీసుకోలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో అధికారుల ఆదేశాల మేరకు విధుల్లోకి తీసుకున్నారు.

విధుల్లోకి సీనియర్ అసిస్టెంట్

విధుల్లోకి సీనియర్ అసిస్టెంట్

విధుల్లోకి సీనియర్ అసిస్టెంట్