
గత ఏడాది కంటే తగ్గిన ఆదాయం
నూతనంగా ఏ ప్రభుత్వం వచ్చినా రియల్ ఎస్టేట్‌లో ఊపు రావాలి. అలాంటిది పాతాళానికి పడిపోయిందంటే ప్రజల కొనుగోలు శక్తి ఏ మేరకు పడిపోయిందో ఈ లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ప్రజల ఆదాయం తగ్గిపోవడంతో ఆస్తుల క్రయవిక్రయాలు అత్యంత దారుణంగా పడిపోయాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ.346.67 కోట్లు ఆదాయం వస్తే చంద్రబాబు మొదటి సంవత్సరంలో రూ.331.23 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే గత సంవత్సరం వచ్చిన ఆదాయం కంటే పెరగాల్సింది పోయి రూ.15.44 కోట్లు తగ్గింది. దీనిని బట్టి చూస్తే మొన్నటి ఆర్థిక సంవత్సరానికి నష్టపోయిన రూ.171 కోట్లు, 2023–24 రావాల్సిన దానికంటే తగ్గిన రూ.15.44 కలుపుకుంటే మొత్తం కలిపి జిల్లాలో రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.186.44 కోట్లు పడిపోయిందన్నది స్పష్టమవుతోంది.