గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి అవార్డులు | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి అవార్డులు

Apr 8 2025 7:45 AM | Updated on Apr 8 2025 7:45 AM

గురుక

గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి అవార్డులు

● 9 బంగారు పతకాలు ● ఉత్తమ జాతీయ గురుకుల పాఠశాలగా గుర్తింపు

కురిచేడు: విజయవాడలో ఈనెల 5వ తేదీ నిర్వహించిన 12వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో కురిచేడు లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం విద్యార్థులు పీ మనోజ్‌కుమార్‌, వీ మనోజ్‌ పాల్‌లు జాతీయ స్థాయిలో బాల చిత్రకళా అవార్డులు అందుకున్నారు. మరో 9 మంది బంగారు పతకాలు, 13 మంది రజిత పతకాలు సాధించారు. వీటితో పాటు కురిచేడు గురుకుల పాఠశాలకు ఉత్తమ ఆర్ట్‌ పాఠశాలగా జాతీయ అవార్డు లభించింది. ఈ పోటీల్లో 1000 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీటితో పాటు అదేరోజు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, స్కూల్‌ ఆఫ్‌ ఫ్లయింగ్‌ అండ్‌ అచీవ్‌మెంట్‌ లు సంయుక్తంగా నిర్వహించిన వికసిత్‌ భారత్‌ మోదీ కార్యక్రమంలో ‘మన ప్రకృతిని మనమే కాపాడుకుందాం’ అనే అంశం పై జాతీయ స్థాయి సీనియర్‌, యువ చిత్రకళాకారులకు ఒన్‌డే స్పాట్‌ పెయింటింగ్‌ పోటీలు నిర్వహించగా స్థానిక పాఠశాల ఆర్ట్స్‌ ఉపాధ్యాయులు కే ప్రసాద్‌రావుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. దీంతో పాటు ప్రశంస పత్రాలు కూడా అందజేశారు. ఈ పోటీల్లో దేశంలోని అన్నీ రాష్ట్రాల నుంచి 135 మంది చిత్రకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఆరోన్‌బాబు విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు కే ప్రసాద్‌రావుకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

బ్యూటీ పార్లర్‌ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ

ఒంగోలు వన్‌టౌన్‌: బ్యూటీ పార్లర్‌ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఒంగోలు రూడ్‌ సెట్‌ సంస్థ డైరెక్టర్‌ శ్రీనివాస రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ ఏప్రిల్‌ 12 నుంచి 35 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ ఉచిత శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాల వారు అర్హులన్నారు. శిక్షణ పొందగోరే అభ్యర్థులు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తారన్నారు. ఇతర పూర్తి వివరాలకు 9573363141 అనే నంబరు పై సంప్రదించాలన్నారు.

బండలాగుడు పోటీల్లో సత్తాచాటిన పల్నాడు ఎడ్లు

కంభం: మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో ఉపదేశశ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీల్లో పల్నాడు జిల్లా క్రోసూరుకు చెందిన సంపటం వీరబ్రహ్మనాయుడు ఎడ్లు 6769.08 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచి సత్తాచాటాయి. మండలంలోని లింగోజిపల్లి గ్రామానికి చెందిన ఆవులపాటి వెంకటేశ్వర్లు ఎడ్లు 5812.05 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, యర్రబాలెంకు చెందిన వెంకటగిరి హేమలత నాయుడు ఎడ్లు 5600 అడుగులు లాగి తృతీయ స్థానం, అర్థవీడుకు చెందిన షేక్‌ మునాఫ్‌ వలి ఎడ్లు 4615 అడుగులు లాగి నాల్గవస్థానం, పొదిలికి చెందిన కూకట్ల నరసింహారావు ఎడ్లు 3600 అడుగులు లాగి ఐదో స్థానం, రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన బొర్రా రవితేజ ఎడ్లు 3373 అడుగులు లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతుల కింద రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేశారు.

పశువులను సంరక్షించాలి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: వేసవిని దృష్టిలో పెట్టుకొని పశువులను సంరక్షించుకోవాలని కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా పేర్కొన్నారు. స్థానిక గ్రీవెన్స్‌ హాలులో సోమవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. పశువులతో పాటు మేకలు, గొర్రెలు, కోళ్లులాంటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు చేసిందన్నారు. పోస్టర్ల రూపంలో గ్రామాల్లో పంపిణీ చేసి పశుపోషకుల్లో, రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా జేసీ గోపాల కృష్ణ, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ బేబీరాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి అవార్డులు 1
1/1

గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి అవార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement