
పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న
రబీ సీజన్‌లో తీవ్ర నష్టం
బేస్తవారిపేట: వేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయి రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. అకాల వర్షాలు, తెగుళ్ల ఉధృతితో సాగుకు అయిన ఖర్చు కూడా రాక నష్టాలు మిగిలాయి. బేస్తవారిపేట మండలంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో పంటలకు నష్టం జరిగితే కేవలం రబీ సీజన్‌కే తీవ్ర కరువు మండలంగా ప్రకటించారు. ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన పంట వివరాలను ప్రభుత్వానికి వ్యవసాయశాఖ అధికారులు పంపినా నేటికీ పట్టించుకోలేదు. రబీ సీజన్‌లో బేస్తవారిపేట మండలంలో వరి 25 హెక్టార్లు, కంది 12, అలసంద 25, మినుము 252, పొగాకు 253, వేరుశనగ 9, రాగి 61, నువ్వులు 58, జొన్న 68, మొక్కజొన్న 1006, వరిగ 73, శనగ 752, సజ్జలు 31, ఉలవలు 30 హెక్టార్లలో దెబ్బతింది. మొత్తం 3,656 మంది రైతులు 2,669 హెక్టార్లలో పంట నష్టపోయినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అక్టోబర్‌లో 200 ఎంఎం వర్షపాతానికి 169, నవంబర్‌లో 89కి 17, డిసెంబర్‌లో 29కి 97, జనవరిలో 7.1కి, ఫిబ్రవరిలో 0.8కి, మార్చి నెలలో 10.2కి జీరో, ఏప్రిల్‌లో 30కి 26.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. సకాలంలో వర్షం పడకపోవడం, పంటలు లేత దశలో ఉన్నప్పుడు ఎక్కువగా పడటంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
మార్కాపురం/తర్లుపాడు/కొనకనమిట్ల:
రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన జాబితాలో మార్కాపురం, కొనకనమిట్ల, రాచర్ల, బేస్తవారపేట, తర్లుపాడు, కంభం, పుల్లలచెరువు, పెద్దారవీడు తదితర మండలాలున్నాయి. ఇందులో తీవ్రమైన కరువున్న మండలాలు పుల్లలచెరువు, కంభం, తర్లుపాడు, పెద్దారవీడు, బేస్తవారపేట మండలాలు ఉండగా ఒక మోస్తరుగా కరువు మండలాలు కొనకనమిట్ల, మార్కాపురం, రాచర్ల ఉన్నాయి. గత మూడు నెలలుగా వర్షపాతం లేకపోవడంతో రబీ సీజన్‌లో సాగుచేసిన పంటలన్నీ దిగుబడులు రాలేదు. పెట్టిన పెట్టుబడి వ్యయం కూడా రైతులకు రాలేదు. మరోవైపు గత ఏడాది డిసెంబరు నుంచి వర్షపాతం లేకపోవడంతో రబీలో సాగుచేసిన మినుము, పప్పుశనగ, కంది, అలసంద పైర్లతోపాటు చివరిదశలో ఉన్న మిర్చి పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోవడం, పెట్టుబడి ఖర్చులు చేతికొచ్చే పరిస్థితి కానరాక రైతులు విలవిల్లాడిపోతున్నారు. 2023 నవంబర్, డిసెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారంతోపాటు 2024 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంట నష్టపరిహారం ఇంతవరకు ప్రభుత్వం రైతులకు ఇవ్వలేదు. వ్యవసాయం కోసం అప్పులు చేసిన రైతులు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నారు.
అడుగంటుతున్న బోర్లు
మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. దీనితో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. మార్కాపురం మండలంలోని 4 పంచాయతీల్లో, కొనకనమిట్ల మండలంలోని 3 పంచాయతీల్లో, దోర్నాల మండలంలోని 6 పంచాయితీల్లో, పెద్దారవీడు మండలంలోని 9 పంచాయితీల్లో పుల్లలచెరువు మండలంలోని 4 పంచాయతీల్లో, తర్లుపాడు మండలంలోని పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం, బిరుదులనరవ, రాయవరం గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని తోలుతున్నారు. పెద్దయాచవరం గ్రామంలో కూడా తాగునీటి సమస్య ఏర్పడింది. తర్లుపాడు మండలంలో తుమ్మలచెరువు, గానుగపెంట, ఒబాయపల్లి, పోతలపాడు, కలుజువ్వలపాడు తదితర గ్రామాల్లో నీటి సమస్య వేధిస్తోంది. పొదిలి మండలంలోని జువ్వలేరు, కొండాయపాలెం గురుగుపాడు గ్రామాల్లో నీటి సమస్య తలెత్తగా ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీరు సరఫరా చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కాపురం మండలంలోని వేములకోట, రాయవరం, నాగులవరం, గజ్జలకొండ, తిప్పాయపాలెం, కొనకనమిట్ల మండలంలోని పలు చెరువులు ఒట్టిపోయాయి.
దిగుబడిపై తీవ్ర ప్రభావం
కంభం: మండలంలో అవసరమైన సమయంలో వర్షం కురవకపోవడంతో శనగ, కంది, మినుము పంటలు పూత దశలో దెబ్బతిని పంట దిగుబడి తగ్గిపోయింది. మండలంలో ఈ ఏడాది శనగ 3589 ఎకరాలు, మొక్కజొన్న 359 ఎకరాలు, కంది 372 ఎకరాలు, మిర్చి 144 ఎకరాలు, జొన్న 73 ఎకరాలు, పొగాకు 306 ఎకరాల్లో సాగుచేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో బోర్లలో నీరందక మొక్క జొన్నపంట ఎక్కువ శాతం దెబ్బతింది. పూత దశలో శనగ ఉండగా అధిక వర్షం కురవడంతో 7 క్వింటాళ్లు రావలసిన దిగుబడి 4 క్వింటాళ్లకు పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో 3–4 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 1.5 క్వింటాళ్లకు పడిపోయింది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీరు తగ్గి బత్తాయి, అరటి తోటలకు నీటి సమస్య తలెత్తింది. మండలంలోని ఎల్‌కోట పంచాయతీ పరిధిలోని సూరేపల్లిలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఎండిపోయిన పంటలు
కరువు మండలాలుగా ప్రకటించిన గ్రామాల్లో రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు వర్షాభావ పరిస్ధితుల వలన ఎండిపోయాయి. ఎక్కువగా మినుము, పప్పుశనగ, కంది, అలసందతోపాటు బొప్పాయి, జామ, బత్తాయి రైతులు నష్టపోయారు.
మినుము 290 560 1959
పప్పుశనగ 972 561 190
అలసంద 138 213 3929
పల్లె పక్కలో కరువు బల్లెం!
లోటు వర్షపాతం
నెల మార్కాపురం తర్లుపాడు
కురవాల్సిన వర్షం కురిసిన వర్షం కురవాల్సిన వర్షం కురిసిన వర్షం
నవంబరు 92.3 మి.మీ 18 మి.మీ 102.7 మి.మీ 10.4మి.మీ
డిసెంబరు 29.2 మి.మీ 45.4మి.మీ 24.7మి.మీ 70.8మి.మీ
జనవరి 6.8మి.మీ 0 మి.మీ 8.7 మి.మీ 0.మి.మీ
ఫిబ్రవరి 5.9 మి.మీ 0 మి.మీ 5.5 మి.మీ 0.మి.మీ
నీరు లేక తోట ఎండిపోతోంది
మూడున్నర ఎకరాల్లో బత్తాయి తోట సాగుచేశాం. గత రెండు నెలల నుంచి వర్షాలు లేకపొవడంతో బోర్లలో నీరు సరిగా రావడం లేదు. ఎకరాకు నీరు పెట్టేందుకు 3 రోజులు పడుతోంది. పంటకు పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి అనుమానమే. నీరు లేనట్లయితే కాయ ఊరదు.
– కె రంగలక్ష్మి,
నాయుడుపల్లి
పంట
మార్కాపురం
సాగు విస్తీర్ణం
(హెక్టార్లలో)
తర్లుపాడు
సాగు విస్తీర్ణం
(హెక్టార్లలో)
కొనకనమిట్ల
సాగు విస్తీర్ణం
(హెక్టార్లలో)

పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న

పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న

పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న

పశ్చిమ ప్రకాశంలోని పలు మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న