ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Apr 11 2025 1:40 AM | Last Updated on Sat, Apr 12 2025 11:34 AM

ఒంగోలు వన్‌టౌన్‌: ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈడీ అర్జున్‌ నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 1305 యూనిట్లు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 21 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న ఎస్సీలు అర్హులని స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి మే 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

కారు డ్రైవర్‌ దారుణ హత్య

నెల్లూరు(క్రైమ్‌): కారు డ్రైవర్‌ దారుణ హత్యకు గురైన ఘటన నెల్లూరు ప్రగతినగర్‌ ఏ–బ్లాక్‌లో గురువారం వెలుగుచూసింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరిగలదిన్నె గ్రామానికి చెందిన మాధవ, జ్యోతి దంపతులకు వాసు (23), వాసవి సంతానం. మాధవ కుటుంబం సుమారు 11 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరానికి వలసొచ్చింది. వారు ప్రస్తుతం ప్రగతినగర్‌ ఏ–బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. మాధవ ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వాసు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పలువురితో అతడికి గొడవలున్నాయి.

హత్య చేశారిలా..

పని ఉందంటూ వాసు బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఏడు గంటల సమయంలో తండ్రికి ఫోన్‌ చేసి పనిమీద ఉన్నానని ఇంటికి రావడం ఆలస్యమవుతందని చెప్పాడు. అర్ధరాత్రి ఓ యువకుడిపై వాసు కత్తితో దాడి చేశాడు. సదరు యువకుడు ఈ విషయాన్ని అప్పటికే వాసు వల్ల ఇబ్బందులు పడుతున్న వినయ్‌, మణికంఠ, లోకేశ్‌ అలియాస్‌ ఛత్రపతి, తేజ, సంతోష్‌తోపాటు మరికొందరికి తెలియజేశాడు. అందరూ కలిసి వాసును ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పట్టుకుని ప్రగతినగర్‌ ఏ–బ్లాక్‌ పదో వీధిలోని దర్గా వద్దకు తీసుకొచ్చి దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వెంగళరావ్‌నగర్‌ సమీప చెరువులో పూడ్చిపెట్టేందుకు తీసుకెళ్లగా అక్కడ జనసంచారం ఉండటంతో ప్రగతినగర్‌ చెరువు సమీపంలోని చెత్తకుప్పలో పడేశారు. మృతదేహంపై పెద్ద చెత్తమూటను వేసి పరారయ్యారు. గురువారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గమనించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. నగర డీఎస్పీ పి.సింధుప్రియ, ఎస్సై రోశయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఛాతి, పొట్ట, గొంతు ఇలా అనేక చోట్ల పెద్ద సంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి. పేగులు సైతం బయటకు వచ్చాయి. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. సాంకేతికత ఆధారంగా నిందితుల్లో కొందరిని పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం సారాయంగడి సెంటర్‌లో ఓ స్వీట్‌ షాపు వద్ద జరిగిన వివాదం కూడా హత్యకు మరో కారణంగా తెలుస్తోంది. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల్లో ఓ రౌడీషీటర్‌ ఉన్నట్లు సమాచారం.

 

మృతదేహాన్ని

చెత్తకుప్పల్లో పడేసిన నిందితులు

పోలీసుల అదుపులో

నిందితులు

మృతుడిది పామూరు మండలం తిరిగలదిన్నె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement