
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
మద్దిపాడు: అనుమానాస్పదస్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన జాతీయ రహదారి పక్కన మద్దిపాడు మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఏడుగుండ్లపాడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కనున్న బస్ షెల్టర్ వద్ద 35 నుంచి 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. అతని చాతిపై సరోజా అని పచ్చబొట్టు ఉంది. అతనికి సంబంధించిన ఇతర ఆనవాళ్లేమీ దొరకలేదు. స్థానిక వీఆర్వో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు స్థానిక ఎస్సై బి.శివరామయ్య తెలిపారు. మృతుడిని గుర్తుపట్టిన వారు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
మార్కాపురం తహసీల్దార్ కారు బోల్తా
● స్వల్ప గాయాలతో బయట పడిన
తహసీల్దార్
పొదిలి రూరల్: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యంతో వెనుక నుంచి వస్తున్న కారు బోల్తా పడింది. ఈ సంఘటన పొదిలి మండలం తలమళ్ల–అగ్రహారం మధ్య ఒంగోలు–కర్నూలు రహదారిపై వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కారులో ఒంగోలు వెళ్తున్నారు. పొదిలి మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలం వద్దకు రాగానే ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు తన వాహనాన్ని రైట్‌కు తిప్పడంతో అతని ప్రాణాలు కాపాడే క్రమంలో తహసీల్దార్ చిరంజీవి సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా కారు మూడు పల్టీలు కొట్టి పక్కన పడింది. కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో తహసీల్దార్ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. తహసీల్దార్ కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని వేరే వాహనంలో ఒంగోలు వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు.
మహిళకు అరుదైన
శస్త్ర చికిత్స ●
● మూడు కిలోల కణతి వెలికితీత
గిద్దలూరు రూరల్: పట్టణంలోని విరంచి వైద్యశాలలో డాక్టర్ మేడిశెట్టి సావిత్రి ఆధ్వర్యంలో రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన ఓ మహిళకు శనివారం అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో ఉన్న 3 కిలోల కణతి వెలికి తీశారు. మహబూబ్‌బీ హైదరాబాద్‌లో ఉంటూ కొంత కాలంగా కడపునొప్పితో బాధపడుతోంది. అక్కడి వైద్యశాలల్లో పరీక్షలు చేయించుకుంది. కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్యులు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో ఆపరేషన్ అంటే లక్షలు ఖర్చు అవుతుందని భావించిన ఆమె గిద్దలూరులోని విరంచి వైద్యశాలలోని డాక్టర్ సావిత్రమ్మను సంప్రదించారు. కడుపు నొప్పి నివారణకు ఆపరేషన్ చేయాలని ఆమె సూచించారు. డాక్టర్ బీవీఆర్‌ఎస్‌ఎస్ విరించి యాదవ్, డాక్టర్ గ్రీష్మా యాదవ్‌ల నేతృత్వంలో ప్రత్యేక వైద్య బృందం సాయంతో ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ప్రమాదకరంగా ఉన్న కణతిని అతికష్టం మీదు వెలికి తీశారు. మహబూబ్‌బీ బంధువులు వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గంజాయి తాగిన
ఇద్దరు అరెస్టు
మార్కాపురం: పట్టణ శివారులోని మార్కెట్ యార్డ్ సమీపం వై. జంక్షన్ వద్ద గంజాయి సేవించి ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై సైదుబాబు శనివారం తెలిపారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర, విద్యానగర్లలో నివాసం ఉండే షేక్ అల్లాభక్ష, షేక్ అక్బర్ ఆలీలు ఇటీవల గోపీనాథ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవించినట్లు తెలిసిందన్నారు. దీంతో వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి అమ్మిన, కొనుగోలు చేసినా, సేవించినా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి