
కరపత్రం
● ఆందోళనలో వ్యాపారులు
సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) అగ్రనేత కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ పేరిట జిల్లాలో కొందరు చందాల వసూళ్లకు పాల్పడుతున్నారు. రెండు దశాబ్దాల కిందట సిరిసిల్ల ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) జనశక్తి సాయుధ నక్సలైట్లు అటవీ గ్రా మాల్లో చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి వారోత్సవాలు ని ర్వహించేవారు. అటవీ గ్రామాల్లో, జనశక్తి పార్టీకి పట్టున్న గ్రామాల్లో అమరవీరుల తాత్కాలిక స్థూపాలు నిర్మించి వర్ధంతి నిర్వహించేవారు. నిర్బంధాలు, ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో జనశక్తి ఉద్యమం క్షీణించడంతో చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభలు, సంస్మరణ వారోత్సవాలు కనుమరుగయ్యా యి. అయితే ప్రస్తుతం సీపీఐ(ఎంఎల్) రాజన్నసిరిసిల్ల జిల్లా కమిటీ పేరిట కరపత్రాలు ముద్రించి సి రిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లోని వ్యాపారులను చందాలు అడుగుతున్నారు. కరపత్రాలు ఇస్తూ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని.. చందాలు ఇవ్వండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానిక వస్త్రవ్యాపారులను రూ.లక్షల్లో అడుగుతూ.. చివరికి రూ.5వేలు, రూ.10వేలు తీసుకెళ్తున్నట్లు సమాచారం. డబ్బులు ఇవ్వబో మని తేల్చిచెబితే సంగతి చూస్తామంటూ బెది రింపులకు దిగుతున్నట్లు తెలిసింది. రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రాంతంలో స్థబ్దుగా ఉన్న చందాల వసూళ్లు మళ్లీ తెరపైకొచ్చాయి.
కరపత్రంలోనూ తప్పులు
చండ్ర పుల్లారెడ్డి సంస్మరణ వారోత్సవాల కరపత్రంలోనూ తప్పులున్నాయి. సిరిసిల్ల గణేశ్‌నగర్‌లో అమరవీరుల సంస్మరణసభ ఉందని కరపత్రంలో పేర్కొన్నారు. అయితే ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో స్పష్టంగా లేకపోవడం చర్చనీయాంశమైంది. కరపత్రంపై ఏ సంవత్సరమో కూడా స్పష్టంగా లేదు. పాత కరపత్రాన్ని చందాల వసూళ్లకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఏఐఎఫ్‌టీయూ, పీవోడబ్ల్యూ, కార్మిక నిర్వహణ అధ్యక్షులు, జిల్లా తెలంగాణ సమరయోధుల సంఘం, రైతుకూలి సంఘం, పీడీఎస్‌యూ పేరిట మధు, సాయి పేరిట కరపత్రాలు ఉన్నాయి. ఏది ఏమైన చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సంస్మరణ సభ పేరిట జిల్లాలో వ్యాపారుల వద్ద చందాల వసూళ్లు చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment