వరికోతల ప్రణాళిక అమలు చేయండి
● కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో వరికోతల మిషన్ల(హార్వేస్టర్ల) యజమానులతో కోతలకు ముందే సమావేశమై, సమగ్ర కోతల ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గన్నీబ్యాగులు, వెయింగ్ మిషన్లు, తేమయంత్రాలు, ప్యాడీక్లీనర్లు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. హార్వెస్టర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైస్‌మిల్లుల వద్ద ఉన్న స్టాక్‌ను తనిఖీ చేయాలని, అక్రమ ధాన్యం రవా ణాను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2022–23 రబీ రైస్ వేలం వేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్ 2023–24 సీఎమ్మార్ డెలివరీ పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ పి.రజిత పాల్గొన్నారు.
అసత్య ప్రచారాలు చేస్తే కేసులు
తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బుధవారం ప్రకటనలో హెచ్చరించారు. తనపై కేసులు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న దాంట్లో వాస్తవం లేదని, ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్ట్ చేస్తున్న వారిపై, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
వేములవాడరూరల్/వేములవాడఅర్బన్: విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. శాత్రాజుపల్లి గురుకుల విద్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. వంట గది, స్టోర్‌రూమ్, డార్మెటరీ, తరగతిగదులు, మెనూ చార్ట్, ఆహార పదార్థాలు పరిశీలించారు. అనంతరం శాత్రాజుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మహేశ్‌కుమార్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ ఉన్నారు.
అనుమతి పత్రాలతోనే ఇసుక తరలించాలి
ప్రభుత్వ రీచ్‌ల నుంచి అనుమతిపత్రాలు వెంట పె ట్టుకుని ఇసుకను తరలించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆపి వే బిల్, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుకను తరలించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment