కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● గంభీరావుపేట పోలీస్‌స్టేషన్ తనిఖీ
ముస్తాబాద్(సిరిసిల్ల): పోలీస్‌స్టేషన్లలో నమోదవుతున్న కేసుల విచారణలో అలసత్వం వహించవద్దని, ఎలాంటి జాప్యం చేయకుండా బాధితులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ అఖిల్‌మహాజన్ మాట్లాడుతూ 100 డయల్‌కు వచ్చే కాల్స్‌పై వెంటనే స్పందించి బ్లూకోర్టు, పెట్రోకార్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లాలన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, సీసీ టీవీల ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. వీపీవోలు విధిగా గ్రామాల్లో పర్యటించాలని, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment