పట్టభద్రులను ఏకం చేద్దాం
● కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలి ● ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
సిరిసిల్లటౌన్: పట్టభద్రులను ఏకం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి సిరిసిల్లలోని డీసీసీ ఆఫీసులో సిరిసిల్ల పట్టణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిరిసిల్లలోని 39వార్డుల్లో 218 మంది పట్టభద్రులను ఏకం చేసి పార్టీకి ఓట్లు వేసే బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ ఎన్నికల్లో అభ్యర్థిని నిలుపలేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, వెల్ముల స్వరూపరెడ్డి, కాముని వనిత, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు.
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌కు సెమీఫైనల్ లాంటివని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేటల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కష్టకాలంలో కాంగ్రెస్ వెన్నంటే ఉన్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లోపాయికారి ఒప్పందంతోనే బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలపలేదన్నారు. పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment