కాలానికి ఎదురీదిన కర్షకులు | - | Sakshi
Sakshi News home page

కాలానికి ఎదురీదిన కర్షకులు

Published Thu, Dec 28 2023 2:04 AM | Last Updated on Thu, Dec 28 2023 2:04 AM

మల్కపేట రిజర్వాయర్‌ కింద వరినాట్లు
్చ - Sakshi

మల్కపేట రిజర్వాయర్‌ కింద వరినాట్లు ్చ

యాసంగిలో అకాల వర్షం

కలిసొచ్చిన వర్షాకాలం

జిల్లాలో రికార్డు స్థాయిలో సాగు

నిండిన జలాశయాలు

ఉబికి వచ్చిన భూగర్భ జలాలు

నేలను.. నింగిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు 2023వ

సంవత్సరం తీపి, చేదు అనుభవాలను మిగిల్చింది. రేయింబవళ్లు కష్టపడే

కర్షకులకు మిశ్రమ ఫలితాలే దక్కాయి. ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు

పడడంతో జలాశయాలు నిండాయి. చెరువులు.. కుంటల్లో నీరు చేరింది. భూగర్భజలాలు రికార్డుస్థాయిలో పైకి చేరాయి. కానీ యాసంగి(రబీ) సీజన్‌లో కురిసిన వడగండ్ల వానలతో రైతులు చేతికొచ్చిన పంటలను కోల్పోవాల్సి వచ్చింది. ఛీడపీడలతో తెల్లబంగారం నల్లగా మారింది. యాసంగిలో

కోతకొచ్చిన వరి పొలం నేలపై

వాలిపోయింది. గింజలు పొలంలోనే

లాకలొచ్చాయి. వెరసి జిల్లాలో

అన్నదాతలు మిశ్రమ ఫలితాలను

అనుభవించారు. ఇలా 2023లో

కర్షకులు కాలానికి ఎదురీదారు.

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు సాగుచేశారు. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2,40,038 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా వరిపంటను 1.62 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. రెండోస్థానంలో పత్తి పంట సేద్యమైంది. ఇతర పంటలను ఈ ఏడాది బాగానే సాగుచేశారు. జిల్లాలో వానాకాలం రికార్డు స్థాయిలో పంటలను వేశారు. పత్తి పంట కొనుగోలుకు జిల్లాలో ఐదు జిన్నింగ్‌ మిల్లులు ఉండగా.. ప్రైవేటుగానే ఎక్కువగా పత్తి కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈ ఏడాది మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్‌లో ధర ఉండడంతో రైతులు పత్తిని అమ్మకుండా ఇళ్లలోనే నిల్వ చేశారు.

కొంపముంచిన అతివృష్టిజిల్లాలో విస్తారంగా పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. పంటలను నష్టపోయిన రైతులకు ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చినా పరిహారం చెల్లించలేదు. పంట నష్టపోయిన రైతులు గుండెల నిండా బాధతో దిక్కులు చూశారు. కౌలురైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సొంతంగా ఉన్న కొద్దిపాటి భూమికి తోడుగా మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగుచేయగా.. నోటికాడి బుక్క నేలపాలైనట్లు అకాల వర్షాలతో పంటలు నేల పాలయ్యా యి. కౌలు రైతులు రెండు విధాలా నష్టపోయారు. అటు కౌలుడబ్బులు చెల్లించాలి. ఇటు పెట్టుబడి పెట్టిన డబ్బులు చేతికి రాక.. చేసిన శ్రమ నేలపాలైన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వపరంగా హెక్టారుకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించి ఏమీ ఇవ్వలేదు. జిల్లాలో బాధిత రైతులు పడిగాపులు కాశారు.

జలం.. పుష్కలం

ఒకప్పుడు జిల్లాలో సాగునీటి కోసం రైతులు భగీరథ ప్రయత్నాలు చేసేవారు. జిల్లాలో వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా చుక్కనీరు రాని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నీటి ఊటలు పెరిగిన జిల్లాగా రాజన్న సిరిసిల్లకు పేరొచ్చింది. దేశంలో శిక్షణ పొందే ఐఏఎస్‌లకు రాజన్న సిరిసిల్ల జిల్లా భూగర్భజలాల పెంపు పాఠ్యాంశంగా మారింది. బోయినపల్లి వద్ద మధ్యమానేరు జలాశయం, గంభీరావుపేట వద్ద ఎగువమానేరు, కోనరావుపేటలో మూలవాగు, జిల్లెల్లలో నక్కవాగు వంటి జలాశయాలు నిండడంతో పాతాళ గంగమ్మ పైకి వచ్చింది. జిల్లాలో 666 చెరువులు ఉండగా.. 458 చెరువులు పూర్తిగా నిండాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 845.4 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది 954 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో శాసీ్త్రయంగా భూగర్భ జలాలను అంచనా వేసేందుకు డిజిటల్‌ వాటర్‌ లెవల్‌ రికార్డర్‌ (డీడబ్ల్యూఎల్‌ఆర్‌) ఏర్పాటు చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రైతులు కాలానికి ఎదురీది పంటలు పండించా రు. వానాకాలంలో జిల్లాలో 3.76 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పంటను పండించి జిల్లాలోని రైతులు రూ.750.83 కోట్ల దిగుబడులు సాధించారు. మొత్తంగా జిల్లా రైతులు ప్రతికూల పరిస్థితుల్లో పంటదిగుబడిని సాధించి జిల్లా ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రాలిన మామిడి కాయలు(ఫైల్‌)
1
1/3

రాలిన మామిడి కాయలు(ఫైల్‌)

 మధ్యమానేరు జలాశయంలో నిల్వ ఉన్న నీరు.
2
2/3

మధ్యమానేరు జలాశయంలో నిల్వ ఉన్న నీరు.

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement