
ప్రశాంత వాతావరణంలో జాతర
వేములవాడ: ప్రశాంత వాతావరణంలో మహాశివరాత్రి జాతర నిర్వహించుకుందామని ఎస్పీ అఖిల్‌మహాజన్ కోరారు. నిబంధనల ప్రకా రం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిద్దామన్నారు. స్థానిక పట్టణ ఠాణాలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్‌కు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జాతరకు పటిష్ట భద్రత
మహాశివరాత్రి జాతరకు 1500 మంది పోలీ సులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శనమయ్యేలా చూడాలన్నారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment