
నిర్లక్ష్యం వీడాలి
● ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించండి ● వివిధ సమస్యలపై 108 దరఖాస్తులు ● స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లటౌన్: ప్రజావాణికి వచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రజాసమస్యలపై స్పందిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ప్రజావాణికి అన్ని మండలాల నుంచి వచ్చిన ఽబాధితులు 108 అర్జీలు అందించారు. రెవెన్యూకు 45, సిరిసిల్ల మున్సిపల్ 14, జిల్లా సంక్షేమ, ఉపాధి కల్పన, ఎస్‌డీసీకి 6 చొప్పున, విద్యాశాఖకు 5, ఎస్పీ ఆఫీస్‌కు 4, నీటిపారుదల, వ్యవసాయ, ఎంపీడీవో తంగళ్లపల్లికి 3 చొప్పున, డీఆర్‌డీవో, రిజిస్టర్, సెస్‌కు 2 చొప్పున, సర్వే, ఆర్‌అండ్‌బీ, జిల్లా పౌరసరఫరాలు, సీపీవో డీపీవో, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్, ఎస్సీ కార్పొరేషన్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు పరికరాల అందజేత
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలతో ఇద్దరు దివ్యాంగులకు పరికరాలు అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి పవన్ పుట్టుకతోనే నడవలేని స్థితిలో ఉన్నాడు. వీల్‌చైర్ ఇప్పించాలని పవన్, మ్యానువల్ ట్రై సైకిల్ ఇప్పించాలని వేములవాడలోని సాయినగర్‌కు చెందిన లేదేళ్ల రమేశ్‌లు విన్నవించారు. కలెక్టర్ ఆదేశాలతో దాసరి పవన్‌కు వీల్‌చైర్, లేదేళ్ల రమేశ్‌కు మ్యానువల్ ట్రై సైకిల్, సంక కర్ర జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment