పశువులకు మేతగా పంట పొలాలు
వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి మండలంలోని పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వదిలేస్తున్నారు. సూరమ్మ ప్రాజెక్టులో నీటిని తొలగించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైనున్న నాగారం, అచ్చయ్య కుంట చెరువులను గోదావరి నీటితో నింపి ఉంటే భూగర్భ జలాలు అడుగంటేవి కాదని అన్నదాతలు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గోదావరి నీటిని రుద్రంగి అచ్చయ్యకుంట, నాగారం చెరువుల్లో నింపాలని వేడుకుంటున్నారు. – రుద్రంగి(వేములవాడ)
Comments
Please login to add a commentAdd a comment