కాంగ్రెస్ తెచ్చిన కరువు
● కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనేశ్వరం ● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. కేసీఆర్‌పై ద్వేషంతోనే కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకోకుండా కరువు సృష్టిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దేవునిగుట్టతండాలో ఎండిన పంట పొ లాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన రైతులు తమ పంటపొలా లు ఎండిపోతున్నాయని, నీళ్లు విడుదల చేయించి కాపాడాలని వేడుకున్నారు. వారి ఆవేదనలు విన్న కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. కేసీ ఆర్‌పై ద్వేషంతోనే మేడిగడ్డలో చిన్న పర్రె ఏర్పడితే అక్కడి నుంచి 15 నెలలుగా నీళ్లు తెచ్చుకో కుండా కాంగ్రెస్ ప్రభుత్వం కరువు సృష్టించింద ని విమర్శించారు. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ కాళేశ్వరం నీటితో మిడ్‌మానేర్, అప్పర్‌మానేర్ నింపిన విషయాన్ని గుర్తు చేశా రు. జిల్లాలోని వాగులు, చెరువులు నింపి రైతుల ను కాపాడుకున్న ప్రభుత్వం తమదని అన్నారు.
మంత్రితో మాట్లాడిన..
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌లతో ఈరోజు మాట్లాడినట్లు కేటీఆర్ తెలి పారు. రాబోయే 48 గంటల్లో నీరు విడిచిపెట్టాలని కోరామని అన్నారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే మంత్రి చాంబర్ ఎదుట భైఠాయిస్తామని తెలిపారు. కేసీఆర్ మీద కోసం ఉంటే మాతో కొట్లాడాలి కానీ రైతులను ఆగం చేయడం ఎంతమాత్రం మంచిది కాదన్నా రు. ఇప్పటికే 450 మంది రైతులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పొట్టనపెట్టుకుందన్నారు. కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణహరి, నాయకులు అందె సుభా్‌శ్, కొండ రమేశ్, నరసింహారెడ్డి, కిషన్, నమిలికొండ శ్రీనివాస్, దేవరాజు తదితరులు ఉన్నారు.
రైతు కుటుంబానికి అండగా ఉంటాం
ముస్తాబాద్: రైతులు ఎవరూ ఆత్మస్థైర్యం కొల్పోవద్దని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన జెల్ల దేవ య్య రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, బాధిత రైతు కుటుంబాన్ని ఆదివా రం పరామర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రూ.2లక్షలు అందజేశారు. ప్రభుత్వ పరంగా దేవయ్య కుటుంబానికి వచ్చే పథకాలు వర్తింపజేసేలా అధికారులతో మాట్లాడుతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment