టీకా వేసి రెండు గంటలు పరిశీలించాలి
● అబ్జర్వేషన్ తర్వాతే ఇంటికి పంపించాలి ● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన తర్వాత రెండు గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. సిరిసిల్లలోని సుందరయ్యనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, బీవైనగర్, శివనగర్, ప్రగతినగర్‌లో వ్యాధి నిరోధక టీకాల కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. పిల్లలకు వేస్తున్న వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పిల్లలకు టీకాలు వేసిన తర్వాత కనీసం రెండు గంటలపాటు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలన్నారు. ఆస్పత్రి రికార్డులను, వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. డాక్టర్ సాహితి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment