8న లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

8న లోక్‌ అదాలత్‌

Published Tue, Mar 4 2025 12:13 AM | Last Updated on Tue, Mar 4 2025 12:13 AM

8న లో

8న లోక్‌ అదాలత్‌

సిరిసిల్ల: జిల్లా కోర్టులో ఈనెల 8న లోక్‌ అదా లత్‌ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత సోమవారం తెలిపారు. కక్షిదారులు సివిల్‌, క్రిమినల్‌ కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కోరారు.

కాల్వ పనులు పూర్తి చేయండి

చందుర్తి(వేములవాడ): పంటలను కాపాడేందుకు ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భూమిని కోల్పోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించి, అసంపూర్తిగా మిగిలిన డిస్ట్రీబ్యూటరీ కాలువ పనులు పూర్తిచేయాలని చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి, చందుర్తి తహసీల్దార్‌, భూసేకరణ విభాగాల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు సో మవారం వినతిపత్రాలు అందించారు. వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని 450 రిజ ర్వాయర్‌ ట్యాంకు అనుసంధానం డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు 132 సర్వేనంబర్‌లో నుంచి వెళ్తున్నాయని, ఆ రైతుకు పరిహారం చెల్లించాలని కోరారు. ఆ సంఘం అధ్యక్షుడు చిలుక పెంటయ్య, బత్తుల కమలాకర్‌, మర్రి రాజు, లక్కర్సు మహేశ్‌, తిరుపతి, గంగాధర్‌, లక్కర్సు రాజేశం, మల్లేశం పాల్గొన్నారు.

రంగనాయకసాగర్‌ కాల్వను పరిశీలించిన అధికారులు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): జక్కాపూర్‌ రంగనాయకసాగర్‌ కాలువను ఎస్‌ఈ రవీందర్‌, అధి కారులు రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. కాలువ ద్వారా నీరు రాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని అధికారులకు రైతులు వివరించారు. స్పందించిన అధికారులు నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాట్ల మధు, విజయేందర్‌, సతీశ్‌, రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

మానేరు నీరు వదలండి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఎగువ మానేరు నీరు వదిలి పంటలను కాపాడాలని ముస్తాబాద్‌లో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. మానేరు కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ–20 వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. నాయకులు శీలం స్వామి, మనోహర్‌, బాలెల్లు, బాలరాజు, దేవయ్య, రాజు, శంకరయ్య, ఎల్లయ్య, పెద్దులు, శ్రీను, పర్శరాములు, చంద్రం, రాజయ్య పాల్గొన్నారు. ఇప్పటికైనా పంటలకు నీరందించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

హక్కుదార్లను భిక్షకులు చేశారు

సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి

సిరిసిల్లటౌన్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఆయకట్టు రైతులను హక్కుదార్లుగా కాకుండా మాజీ మంత్రి కేటీఆర్‌ భిక్షకులుగా మార్చారని కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేంందర్‌రెడ్డి మండిపడ్డారు. సిరిసిల్లలోని తన నివాసంలో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతంలో రైతుల సమస్యలు విన్న పాపాన పోని కేటీఆర్‌.. ఇటీవల జిల్లాలో పర్యటించి వారిపై లేనిపోని ప్రేమను ఒలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా రైతులకు ప్రయోజనం కలిగించే 9, 10, 11, 12వ ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదో కేటీఆర్‌ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.312కోట్లు కేటాయిస్తే 1.6లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉండేదన్నారు. ‘కేసీఆర్‌ అంటే కాళేశ్వరం కరెప్షన్‌ రావు’ అంటూ ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఇప్పుడు కూలేశ్వరంగా ఉందని విమర్శించారు. చెక్‌డ్యాంలు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం వారి అక్రమాలకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, గడ్డం నర్సయ్య, కాముని వనిత, కల్లూరి చందన, ఆడెపు చంద్రకళ, బైరినేని రాము, యెల్లె లక్ష్మీనారాయణ, వంతడ్పుల రాము పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
8న లోక్‌ అదాలత్‌1
1/3

8న లోక్‌ అదాలత్‌

8న లోక్‌ అదాలత్‌2
2/3

8న లోక్‌ అదాలత్‌

8న లోక్‌ అదాలత్‌3
3/3

8న లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement