విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు
● ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: విధి నిర్వహణలో వైద్యులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ సందీప్‌కుమార్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, జనరల్, ప్రసూతి, ఆర్థో, పీడియాట్రిక్, సర్జి కల్ వార్డులు, ఇతర విభాగాలను పరిశీలించారు. రోస్టర్ విధానంలో ఎంతమంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు? ఇబ్బందులున్నాయా? అ ని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు? వారికి ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారు అని ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంతో రోగులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, వారికి అన్ని రకాలుగా భరోసా కల్పించి మెరుగైన వైద్యం అందించడం వైద్యులు, సిబ్బంది కర్తవ్యమని గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలని అన్నారు. లివర్ సమస్యతో బాధపడుతున్న ఒక రోగికి వైద్యం అందించినా మెరుగుపడలేదని కుటుంబసభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. స్పందించిన కలెక్టర్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హైదరాబా ద్ పంపించి మెరుగైన వైద్యం అందించేలా చూ డాలన్నారు. నిత్యం పర్యవేక్షించాలని ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణను కలెక్టర్ ఫోన్‌లో కోరారు.
శ్రీపాదరావు సేవలు మరువలేనివి
మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, జిల్లా క్రీడల అధికారి ఆజ్మీరా రాందాస్, ఎల్‌డీఎం మల్లికార్జున్, బీసీ వెల్ఫేర్ అధికారి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చదువుతోనే ఉన్నత శిఖరాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చదువే ఆయుధమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. నిత్య సాధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల ఏకలవ్య విద్యాలయాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్, వంటసామగ్రి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠం చెప్పారు. విద్యార్థులకు కల్పిస్తున్న డైనింగ్‌హాల్, టాయిలెట్స్, గ్రౌండ్, ఇతర వసతులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment