
వెంకట్రావుపల్లిలో సమగ్ర సర్వే
● ఎట్టకేలకు వివరాలు ఇచ్చిన గ్రామస్తులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఎట్టకేలకు మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామస్తులు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. తమ గ్రామ సరిహద్దు వివాదం నేపథ్యంలో నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో వివరాలు ఇవ్వలేదు. ఇటీవల ఎమ్మెల్యే గ్రామస్తులతో సమావేశమై సరిహద్దుల విషయంలో సుస్పష్టమైన హామీ ఇవ్వడంతో సోమవారం నుంచి గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో 19 మంది సెక్రటరీలు పాల్గొన్నారు. గ్రామంలో 285 కుటుంబాలలో 1,038 మంది ఉన్నారని ఎంపీడీవో శశికళ తెలిపారు. సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 28 వరకు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment