ముగిసిన ప్రచారం
● ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ పోటాపోటీ సభలు ● సభలతో పార్టీ క్యాడర్లలో జోష్ ● గెలుపుపై ఎవరి ధీమా వారిదే
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. నిబంధనల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి సైలెంట్ మోడ్ అమలులోకి వచ్చింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు, సంఘాలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఎస్‌పీ తరఫున బీసీ నేతలు నిర్వహించిన సభల సక్సెస్‌తో ఆయా క్యాడర్ జోష్‌లో ఉంది.
ఉమ్మడి కరీంనగర్ కీలకం
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారింది. ఉమ్మడి జిల్లా ఓటర్లు ఎటు మొగ్గుతే వాళ్లు విజయం సాధించే అవకాశాలున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 55 వేల 159 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 1 లక్షా 60 వేల 260 ఓట్లున్నాయి. అంటే ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు సగం ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల తీర్పుపైనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉంది. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబఽంధించి మొత్తం 27,088 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8,135 ఓట్లున్నాయి. ఇక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపోటములను నిర్ణయించనుంది.
గెలుపుపై ధీమా
పట్టభద్రులకు సంబంధించి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ అభ్యర్థుల నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి పార్టీల బలంపై, బీఎస్‌పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదంపై ఆశలు పెట్టుకున్నారు. సివిల్ సప్‌లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 15 మంది పోటీలో ఉండగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్‌పీసీ మద్దతుతో వై.అశోక్‌కుమార్, ఎస్‌టీయూ, సీపీఎస్‌ల నుంచి పోటీలో ఉన్న కూర రఘోత్తంరెడ్డి నడుమ పోటీ నెలకొంది.
ప్రచారసభలతో జోష్
గతంలో లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార సభలు నిర్వహించి తమకు ఓటెందుకు వేయాలో వివరించే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపు బాధ్యతలను పూర్తిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భుజానికెత్తుకొన్నారు. కామారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ పాల్గొన్నారు. బీసీ వాదంతో బరిలోకి దిగిన బీఎస్‌పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా బీసీ జేఏసీ రాష్ట్ర నేతలు, బీసీ సంఘాల నేతలు, ఓయూ జేఏసీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. సభల విజయవంతంతో క్యాడర్‌లో జోష్ నెలకొనడంతో పాటు, గెలుపుపై ధీమా పెరిగింది.
ముగిసిన ప్రచారం
ముగిసిన ప్రచారం
ముగిసిన ప్రచారం
ముగిసిన ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment