పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్లకల్చరల్/కోనరావుపేట/చందుర్తి: శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. చందుర్తి, కోనరావుపేట, వేములవాడల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతీ ఓటర్‌కు ఓటరు స్లిప్ అందేలా జాగ్రత్త వహించాలని సూచించారు. ఓటర్లకు క్యూలైన్లు, ఏర్పాటు చేయాలని, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చివరి ఓటు వినియోగించుకున్నాక బ్యాలెట్ బాక్సులను నిబంధనల మేరకు సీల్ చేయాలని తెలిపారు. విధుల నిర్వహణలో అలసత్వం లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్‌రావు, తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్‌రావు, మహేశ్, సుజాత, ఇతర అధికారులు ఉన్నారు.
సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్ సందర్శించారు. కేంద్రాల వారీగా సామగ్రిని పంపిణీ చేసేందుకు కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవోలు రాధాబాయి, రాజేశ్వర్, తహసీల్దార్లు ఉమారాణి,మహేశ్, కమిషనర్ సమ్మయ్య ఉన్నారు.
రైతు కుటుంబానికి రూ.లక్ష తక్షణ సాయం
ముస్తాబాద్ మండలం పోతుగల్‌లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు దేవయ్య కుటుంబానికి తక్షన సాయంగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్ష మంగళవారం అందజేశారు.
ఆర్థిక అక్షరాస్యత పోస్టర్ ఆవిష్కరణ
ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆవిష్కరించారు. 28వరకు జరుగనున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల నేపథ్యంలో కుటుంబ, దేశ ఆర్థికాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమైందన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ టీఎన్ మల్లికార్జున్‌రావు, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి పీబీ శ్రీనివాస్, పౌర సంబంధాల అధికారి వంగరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment