ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్‌శాఖ పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, చందుర్తి పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం తనిఖీ చేసి కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 41 పోలింగ్ కేంద్రాల్లో 23,347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పర్యవేక్షణలో టౌన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, రూరల్ సీఐ మొగిలి, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.
● ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment