● ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సిరిసిల్లటౌన్: మల్కపేట రిజర్వాయర్ ద్వారా మిడ్‌మానేర్ నీటిని ఎత్తిపోసి సింగసముద్రాన్ని నింపాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు లేఖ రాశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే మ ల్కపేట రిజర్వాయర్ ఎత్తిపోతల ట్రయల్‌రన్ కూడా పూర్తయిందని, ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రారంభోత్సవం చేయలేకపోయామని పేర్కొన్నారు. ఇప్పుడు మిడ్ మానేరులో 17 టీఎంసీల నీరు ఉన్నందున నీటిని ఎత్తి పోసి సింగసముద్రం పరిధిలోని 2వేల ఎకరాలకు సాగునీరందించాలని కోరారు. నీటి ద్వారా రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, దేవునిగుట్ట తండా, రాచర్ల తిమ్మాపూర్, బాకూర్‌పల్లి తండా, రాజన్నపేట, కిష్టునాయక్ తండా, అక్కపల్లి, బుగ్గ రాజేశ్వర తండా, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, కోరుట్లపేట, సముద్ర లింగాపూర్ రైతుల పంటలను కాపాడుకున్న వారమవుతామని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment