80 ఏళ్ల వేడుకను జయప్రదం చేయండి
సిరిసిల్లకల్చరల్: టీఎన్‌జీవోల సంఘం 80 వసంతాల వేడుకను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 317 జీవో బాధితులు, కారుణ్య నియామకాలు, పీఆర్‌సీ పెండింగ్ డీఏలను కూడా అదే వేగంతో క్లియర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎలుసాని ప్రవీణ్‌కుమార్, గాజుల సుదర్శనం, సమర్‌సేన్ జయంత్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కుమార్‌స్వామి, జీవన్, ఎం శ్రీకాంత్, రియాజ్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment