జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన బాలె తేజస్విని (32) చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసుల వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మీసాల కాంతయ్య కూతురు తేజస్వినిని 2020లో గాంధీనగర్‌కు చెందిన బాలె సాయిరాజ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కూతురు (3) సంతానం. కొద్దికాలంగా తేజస్విని కడుపునొప్పితో బాధపడుతోంది. జనవరి 31న పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిరోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రయత్నించినా లాభంలేకపోయింది. మృతురాలి తండ్రి మీసాల కాంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మథరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment