ప్రేమిస్తున్నానని బాలికను వేధించిన వ్యక్తికి జైలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ప్రేమిస్తున్నాని ఓ బాలికను వేధిస్తున్న మియ్యాపూర్ గ్రామానికి చెందిన గోషిక కుమార్(23)కు ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి, సెషన్స్ జడ్జి శ్రీనివాస్‌రావు మంగళవారం 30 రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2019 నవంబర్ 20న ఓ బాలికలను ప్రేమిస్తున్నా, తననూ ప్రేమించాలని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాని వేధించాడు. తనను ప్రేమించకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలి తండ్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. వాదనలు విన్నంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించారు.
మంథనిలో బోర్డు తిప్పేసిన నగల వ్యాపారి?
మంథని: పట్టణంలోని ఓ నగల దుకాణదారు బోర్డు తిప్పేసి పరారైనట్లు చర్చ జోరుగా సాగుతోంది. దుకాణానికి తాళం వేసి కుటుంబం మొత్తం నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిందని సమాచారం. వారి మొబైల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దుకాణం తెరవకపపోవడం, ఫోన్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తమకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించారా? లేదా ఏదేవి అవసరం నిమిత్తం వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది. వివాహాలకు సంబంధించి ఆవభరణాల కోసం చాలా మంది దుకాణాదారుకు బంగారం ఇచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా స్థానికుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. దుకాణాదారు పరారు కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
కోరుట్లరూరల్: మాదాపూర్‌కు చెందిన ముక్కెరాల చంద్రయ్య (70) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చంద్ర య్య సైకిల్‌పై వెంకటాపూ ర్ వెళ్లి తిరిగి మాదాపూర్ వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అంజూ ట్రాక్టర్ నడుపుతూ వెంకటాపూర్ వైపు వెళ్తున్నాడు. కాకతీయ కాలువ డీ–40 మూలమలుపు వద్ద చంద్రయ్య ట్రాక్టర్‌ను ఢీకొట్టి రోడ్డు కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్య కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు డ్రైవర్ అంజి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. స్థానిక నాయకులు సముదాయించి ధర్నాను విరమింప చేశారు.
తండ్రి హత్య కేసులో యావజ్జీవం
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): పూసాల గ్రా మానికి చెందిన తీగల రాజేశం(40) తన తండ్రి తీగల నర్సయ్యను హత్య చేశాడనే నేరం రుజు వు కావడంతో యావజ్జీవ శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జిల్లా, సెస న్స్ జడ్జి శ్రీనివాస్‌రావు మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబం పూసాలలో నివాసం ఉంటోంది. రాజేశం 20ఏళ్ల క్రితం హ త్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అ ప్పట్నుంచి తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నా డు. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 8న ఉద యం కొనుగోలు సెంటర్లో ధాన్యం అరబెట్టేందుకు పెద్దకొడుకు రాజేశం, చిన్నకోడలును రా వాలని తండ్రి నర్సయ్య పిలిచారు. రాజేశం సైకిల్‌పై అక్కడకు వెళ్లగా.. తాను పనిచేయనని సైకిల్‌పై వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో తండ్రి సైకిల్ తాళం చెవి తీసకున్నాడు. ఆగ్రహించిన రాజేశం బలంగా నెట్టి వేయడంతో తండ్రికింద పడిపోయాడు. ఆ వెంటనే బండరాయితో తల పై మోదాడు. దీంతో నర్సయ్య మృతి చెందా డు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేసిన పోలీసులు.. కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు.
వేటగాళ్లపై అడవిపందుల దాడి
చందుర్తి: అడవిపందుల దాడిలో వేటగాళ్లకు తీవ్రగాయాలయిన ఘటన చందుర్తి శివారులోని బోడగుట్ట ప్రాంతంలో మంగళవారం చో టు చేసుకుంది. జోగాపూర్ గ్రామానికి చెందిన సంచార జీవనం సాగించేవారితో అడవిపందు ల వేటకు వెళ్లారు. అప్పటికే వారికి పంది చిక్కగా, మరో దానికోసం వేటాడుతుండగా దాడిచేసింది. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment