ఉదయ సాహితీ రాష్ట్ర కార్యవర్గం
డీఈవోగా జనార్దన్ రావు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాధికారిగా జనార్దన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల డీఈవోగా జిల్లాకు వచ్చిన డైట్ లెక్చరర్ జగన్మోహన్‌రెడ్డి సెలవుపై వెళ్లడంతో జిల్లా విద్యాధికారి మార్పు జరిగినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రంజాన్ పండుగ ఏర్పాట్లు చేయాలి
సిరిసిల్లకల్చరల్: ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో పండుగ ఏర్పాట్లు చేయాలని జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి ఎంఏ భారతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మసీద్‌లు, ఈద్గాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్, నీటి సౌకర్యానికి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహర్, ఇఫ్తార్ సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దన్నారు. సమావేశంలో ఆర్డీవో రాధాబాయి, డీపీవో శేషాద్రి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడ కమిషనర్ అన్వేష్, పౌరసరఫరాల అధికారి పి.వసంతలక్ష్మి, డీఎస్పీ మురళీకృష్ణ, సెస్ అధికారి డి.అరవింద్‌చారి, తహసీల్దార్ ఉమారాణి, ముస్లిం మత పెద్దలు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
జ్యోతినగర్(రామగుండం): ఉదయ సాహితీ తె లంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీదాస్యం లక్ష్మయ్య ప్రకటించారు. సంస్థ గౌరవ అధ్యక్షుడిగా దాస్యం సేనాధిపతి(కరీంనగర్), అ ధ్యక్షుడిగా శ్రీదాస్యం లక్ష్మయ్య(పెద్దపల్లి), ఉపాధ్యక్షులుగా ఎన్‌వీ రఘువీర్ ప్రతాప్(నల్గొండ), పోరెడ్డి రంగయ్య(ఆలేరు), పల్లేరు వీరాస్వామి(వరంగల్), ఎర్రం రాజారెడ్డి(కరీంనగర్), శ్రీపెరంబుదూరి లింబగిరి స్వామి(మెట్‌పల్లి), మహి ళా ఉపాధ్యక్షులుగా చీదేళ్ల సీతాలక్ష్మీ(హైదరాబాద్), రమాదేవి కులకర్ణి(హైదరాబాద్), మద్దెల సరోజన(జగిత్యాల), చిందం సునీత(కరీంనగర్), కటుకం కవిత(కోరుట్ల), ప్రధాన కార్యదర్శిగా వురిమళ్ల సునంద, సహాయ కా ర్యదర్శులుగా ఏడెల్లి రాములు(పెద్దపల్లి), గుడ్ల దొన సాయిచంద్రశేఖర్(హైదరాబాద్), మేరుగు అనురాధ(వరంగల్), రాజన్న(కరీంనగర్), కోశాధికారిగా వెంకటరమణాచార్యులు(హైదరాబాద్)ను నియమించారు.
ఉదయ సాహితీ రాష్ట్ర కార్యవర్గం
Comments
Please login to add a commentAdd a comment